దుమ్మురేపుతున్న 'పెట్టా' ట్రైలర్.!

SMTV Desk 2018-12-28 13:31:20  Rajinikanth, Petta, Trailer, Sankranthi Realese,Trisha,Simran,Vijay sethupati,Karthik

హైదరాబాద్, డిసెంబర్ 28: సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తున్న పెట్టా సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. సిమ్రాన్ .. త్రిష కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, తమిళ, తెలుగు భాషల్లో జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. రజనీ, సిమ్రాన్, త్రిష ,నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా .. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

రజనీ కాంత్ ఈ సినిమాలో మరింత యంగ్ గా, స్టైల్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ .. కామెడీ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. ఈ ట్రైలర్ చివరిలో మాస్ బీట్ కి ఆయన వేసిన స్టెప్పులు ఆకర్షణీయంగా ఉన్నాయి. రజనీ సినిమా నుంచి అభిమానులు ఆశించే జోష్ ఈ సినిమాలో పుష్కలంగా ఉందనే విషయం ఈ ట్రైలర్ లో తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో గట్టిపోటీ ఉన్నప్పటికీ, రజనీ తనదైన స్టైల్ సందడి చేస్తాడనే అనిపిస్తోంది. విడుదల అయిన రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్ దాటి దుమ్మురేపుతోంది.