చంద్రుబాబు ఉక్కు పరిశ్రమకు కేంద్రం సంచలన ప్రకటన

SMTV Desk 2018-12-27 20:26:17  AP, CM, Chandrababu, Steel factory, BJP, Central governament

అమరావతి, డిసెంబర్ 27: ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ పరిశ్రమకు కేంద్ర సర్కార్ సహకరింహక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని సొంతంగా ప్రారంభించడానికి సిద్దమవుతుంది. ఇప్పటికే పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని లాంఛనాలను పూర్తిచేసిన ప్రభుత్వం ఈ రోజు వైభవంగా దీన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని నిర్ణయించుకున్న చంద్రబాబుకి కేంద్రం షాక్ ఇచ్చింది.

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ప్రకటించింది. ముడి పదార్ధాల లభ్యత, గనులకు సంబంధించిన ఉన్నత స్థాయి టాస్కో పోర్స్ ఏర్పాటు చేసినట్లు కేంద్రం గుర్తుచేసింది. దీని ద్వారా ఎన్నిసార్లు వివరాలు కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లేకుండా పోయిందని వెల్లడించింది. మరో వైపు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని సెయిల్‌ నివేదిక ఇచ్చిందని ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. సాద్యాసాధ్యాలను పరిశీలిస్తుండగానే ఏపి సీఎం అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చిత్తశుద్దితో పనిచేస్తోందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ కూడా ఏపికి చెందిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని బిజెపి నాయకులు పేర్కొన్నారు.