తెలుగు రాష్ట్రాల హై కోర్టులకి న్యాముర్తుల నియామకం

SMTV Desk 2018-12-27 19:48:06  Telangana, Andhrapradesh, High court, Central governament, High court judge, Radhakrishnan, Praveen kumar

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 27: విభజన జరిగిన నాలుగేళ్ల విరామం తరువాత ఎట్టకేలకు కేంద్రం హై కోర్ట్ విభజనపై గెజిట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల చేసింది. ఈ విభజనపై కొందరు న్యాయవాదులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొంత మంది పూర్తి వ్యతిరేఖత తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు హై కోర్టులో గందరగోళం జరిగింది. అనంతరం న్యామూర్తుల నియామకం జరిగింది. జనవరి 1 నుంచి ఏపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రాధాకృష్ణన్‌ను తెలంగాణ సిజేఏగా కొనసాగనున్నారు.

ఈ మేరకు కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహన్‌, జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌ను తెలంగాణకు కేటాయిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. ఉమ్మడి హైకోర్టులో ప్రస్తుతం మొత్తం 27 మంది న్యాయమూర్తులు సేవలందిస్తుండగా 14 మందిని ఏపికి, 10 మందిని తెలంగాణకు కేటాయించారు. ఏపికి కేటాయించిన వారిలో జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు. తాజా ఉత్తర్వులతో ఏపిలో 14 మంది, తెలంగాణలో 13 మంది న్యాయమూర్తులు సేవలందించనున్నారు.