వచ్చే ఏడాది చివర్లో ఆర్ ఆర్ ఆర్ ...??

SMTV Desk 2018-12-27 18:05:46  Ramcharan, Jr.NTR, S S Rajamouli, R R R, Updates

హైదరాబాద్, డిసెంబర్ 27: రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మల్టీ స్టారర్ ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఆంగ్లేయుల పరిపాలన కాలం నేపథ్యంలో కొనసాగుతుందని సమాచారం. పోలీస్ ఆఫీసర్ గా చరణ్... బందిపోటుగా ఎన్టీఆర్ కనిపించనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే వొక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది.

రాజమౌళి ఇంతవరకూ ఎన్టీఆర్ .. చరణ్ తరువాత ఇతర ఆర్టిస్టుల వివరాలను ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా షూటింగుకే చాలా సమయం పడుతుందనే అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. కానీ, ఈ సినిమాను దసరా పండుగలోగా పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ వరకూ చరణ్ .. ఎన్టీఆర్ రాజమౌళికి డేట్స్ ఇచ్చేశారట. దసరా లోపు షూటింగు పార్టును పూర్తిచేసి, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అలాఅయితే 2019 చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు వున్నాయన్న మాట.