విభజనపై హై కోర్టులో గందరగోళం

SMTV Desk 2018-12-27 16:29:05  Telangana, Andhrapradesh, High court, Central governament

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్ల విరామం తరువాత ఎట్టకేలకు కేంద్రం హై కోర్ట్ విభజనపై గెజిట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. విభజన జరిగి నాలుగేళ్ల తరువాత తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా హై కోర్టులు పనిచేయనున్నాయి. జనవరి 1వ తేదీ నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హై కోర్టులు పనిచేయనున్నాయి. అయితే ఈ విభజనపై ఉమ్మడి హై కోర్టులో గందరగోళం ఏర్పడింది. దీంతో చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ దిగి వెళ్లిపోయారు. అటు హైకోర్టు వద్ద విభజనపై న్యాయవాదలు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి కేసులపై స్పష్టత లేదని కొందరు న్యాయవాదుల వాదిస్తున్నారు. సిబ్బంది, దస్త్రాల విభజన జరగలేదని, ఏపీలో కొత్త భవనాలు ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ వ్యవహారం పై మరికొద్దిసేపట్లో సీజేను ఏపీ న్యాయవాదులు కలువనున్నారు.