ట్రిపుల్ ఆర్ సినిమాలో 'కె.జి.ఎఫ్' హీరో

SMTV Desk 2018-12-27 13:04:27  RRR, Yash, KGF, Ram charan, Rajamouli,

హైదరాబాద్, డిసెంబర్ 27: బాహుబలి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో పాటుగా స్క్రీన్ షేర్ చేసుకునే వారి మీద కూడా అందరి దృష్టి ఉంది. ఈ సినిమాలో విలన్ గా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్నాడని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తే. ఈమధ్యనే తెలుగులో యశ్ కె.జి.ఎఫ్ సినిమా రిలీజైంది. సినిమా మాస్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. బి, సి సెంటర్స్ లో కె.జి.ఎఫ్ మంచి వసూళ్లు తెస్తుంది.

ట్రిపుల్ ఆర్ లో యశ్ ఉన్నాడా.. లేడా.. అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. యశ్ నటించిన కె.జి.ఎఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా వచ్చి విష్ చేశారు. మరి వస్తున్న వార్తలన్ని నిజం చేస్తూ ఆర్.ఆర్.ఆర్ లో యశ్ కు ఛాన్స్ ఇస్తాడా లేదా రాజమౌళి ఆలోచన ఏంటో త్వరలో తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ట్రిపుల్ ఆర్ మూవీ సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో మొదలవుతుందట.