భారత్ స్కోర్ 443/7,డిక్లేర్డ్ !!!

SMTV Desk 2018-12-27 12:29:45  Team india, Australia, Test match, Melbourne Cricket Ground (MCG), Melbourne, Kohli

మెల్‌బోర్న్, డిసెంబర్ 27: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్ - ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా బుధవారం మూడో టెస్టు ప్రారంభం అయింది. ఆస్ట్రేలియాపై జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచు రెండో రోజు ఆట ప్రారంభం కాగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో 40 పరుగులు జోడించి 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్క్ బౌలింగులో అవుటయ్యాడు.

భారత్ 293 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. వికెట్ల వద్ద గోడలా నిలబడిన ఛతేశ్వర్ వుజారా కూడా ఆ తర్వాత కొద్దిసేపటికే అవుటయ్యాడు. అతను 106 పరుగులు చేసి కమిన్స్ బౌలింగులో అవుటయ్యాడు.తర్వాత వచ్చిన అజింక్యా రహానే 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లయన్ బౌలింగులో పెవిలియన్ కు చేరుకున్నాడు. దీంతో భారత్ 299 పరుగుల వద్ద నాలుగో వికెట్ జారవిడుచుకుంది. Cheteshwar Pujara was the highest scorer for the visitors with 106 runs.



తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్కార్క్ కు చిక్కాడు. రోహిత్ శర్మ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అతను 62 బంతుల్లో యాభై పరుగులు చేశాడు. తద్వారా గత కొంత కాలంగా తనపై వస్తున్న విమర్శలకు తన బ్యాట్ ద్వారా సమాధానం చెప్పాడు.

పంత్ అవుటవగానే ఫీల్డ్ లో కి వచ్చిన జడేజా 4 పరుగులు మాత్రమే చేసి హాజిల్ వుడ్ బౌలింగులో అవుటయ్యాడు. 443 పరుగుల వద్ద జడెజా రూపంలో భారత్ ఏడో వికెట్ ను కోల్పోయింది..
Earlier, India had declared their first innings at 443/7.



మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులను 7 వికెట్ల నష్టానికి 443 పరుగుల వద్ద భారత్ డిక్లేర్ చేసింది. రోహిత్ సర్మ 63 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు, స్టార్క్ రెండు వికెట్లు తీసుకున్నారు. హాజిల్ వుడ్, లయన్ లకు తలో వికెట్ దక్కాయి.

అంతకుముందు మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో ఛతేశ్వర్‌ పుజారా సెంచరీ చేశాడు. రెండోరోజు గురువారం లైయన్‌ వేసిన 113వ ఓవర్‌ మొదటి బంతిని ఫోర్‌గా మలచడం ద్వారా పుజారా 281 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన పుజారా క్రీజులో కుదురుకుని ఆసీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కుంటున్నాడు. భారత కెప్టెన్ విరాట్‌కోహ్లీ పుజారాకు మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. అతను అర్థ సెంచరీ చేశాడు.