మరో రికార్డును సాధించిన విరాట్

SMTV Desk 2018-12-27 12:18:04  Team india, test match, virat kohli, Rahul dravid

మెల్‌బోర్న్, డిసెంబర్ 27: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వొక సంవత్సరం విదేశీ గడ్డపై ఎక్కువ పరుగులు సాధించిన టిమిండియా బ్యాట్స్‌మెన్‌ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.

ఇదివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరుమీద ఉంది. 2002లో విదేశీ గడ్డపై ద్రవిడ్‌ 1137 పరుగులు చేశాడు. అనంతరం దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆసీస్‌తో జరుగుతున్న టెస్టుల్లో కోహ్లీ 1138 పరుగులు చేశాడు. ద్రవిడ్‌ కంటే ముందు 1983లో మొహీందర్‌ అమర్‌నాథ్‌ 1065 పరుగులు చేయగా.. 1971లో సునీల్ గావస్కర్‌ 918 పరుగులు చేశారు.