రాష్ట్రపతిని కలిసిన ఉపరాష్ట్రపతి, ప్రధాని

SMTV Desk 2017-07-27 14:28:54  president, narendra modi, hamidhansari, house, twitter

న్యూఢిల్లీ, జూలై 27 : భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీలు బుధవారం రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రతిని రాష్ట్రపతికి ప్రధాని అందచేస్తున్న ఫొటోను మోదీ ట్విటర్‌ చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలుసుకున్నట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ కేకే.కౌల్‌, కేంద్ర మంత్రి సీఆర్‌ చౌధురి తదితరులు రాష్ట్రపతితో మర్యాద పూర్వకంగా సమావేశమైనారు. గుజరాత్‌, రాజస్థాన్‌, అసోం ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరద బీభత్సవానికి గురైన వారికి రాష్ట్రపతి కోవింద్‌ తన సానుభూతి తెలియజేసారు.