కొత్త సంవత్సరంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు

SMTV Desk 2018-12-27 10:57:51  Telangana, New year, IT Jobs, Infosys

హైదరాబాద్, డిసెంబర్ 27: రాబోతున్న కొత్త సంవత్సరంలో ప్రముఖ ఐటీ, అంకుర సంస్థలు దాదాపు 5 లక్షల ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఐటీ రంగాల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి 2018 పోల్చుకుంటే గరిష్టంగా 20 శాతం జీతభత్యాలు ఉండవచ్చని చెప్పారు.

ప్రస్తుతం ఐటీ రంగ ఉద్యోగుల ప్రాధమిక వేతనాలు ఇప్పుడు ఏడాదికి రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగాయని అన్నారు. కాగా గత కొన్నేళ్లుగా ఐటీ రంగంలో స్తబ్దత ఉండగా, వచ్చే ఏడాదిలో పరిస్థితి ఎంతో ఆశావహంగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు.