జ‌న‌సైనికుల వీరంగం

SMTV Desk 2018-12-26 18:54:22  janasena, janasena party glass,

చిత్తూర్, డిసెంబర్ 26: జనసేన పార్టీ కి ఇటీవల ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసూ ని గుర్తు గా ప్రకటించిన విషయం తెలిసిందే , మరి గ‌రీబోడు ఛాయ్ కొట్టే గాజు గ‌లాసుకు అంత డిమాండ్ ఏంటో? వొక్కో గ్లాసు రూ.50 ధ‌ర ప‌లుకుతోందిట‌. ఇదంతా ఎవ‌రికి ఎఫెక్ట‌? అంటే జ‌న‌సేనాని ఎఫెక్ట్ అని అంటున్నారు. జ‌న‌సేన సింబ‌ల్ గాజు గ్లాస్ అని ఎన్నిక‌ల క‌మీష‌న్ ప్ర‌క‌టించ‌గానే జ‌న‌సైనికులంతా ఈ గ్లాసుల‌పై ప‌డ్డార‌ట‌. ఓవైపు ఉత్త‌రాంధ్ర‌, మ‌రోవైపు ఉభ‌య‌గోదారి జిల్లాలు స‌హా చిత్తూరు త‌దిత‌ర ఏరియాల్లో షాపుల్లో గాజు గ్లాసుల‌న్నీ మాయ‌మైపోతున్నాయ‌ట‌. కొన్నిచోట్ల అయితే నో స్టాక్ అంటూ బోర్డులు ద‌ర్శ‌న‌మివ్వ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

గాజు గ్లాసు పార్టీ సింబ‌ల్ అన‌గానే త‌మ పార్టీ గుర్తును జ‌నాల్లోకి తీసుకెళ్లాల్సిందిగా ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌క‌టించారు. దీంతో జ‌న‌సైనికుల వీరంగం మొద‌లైంది. ప్ర‌స్తుతం ఏ గ‌ల్లీలో చూసినా గ్లాసు కోసం ఎగ‌బ‌డుతున్న జ‌న‌సైనికులు ద‌ర్శ‌న‌మిస్తున్నార‌ట‌. అందుకే మామూలుగా రూ.20కే దొరికే గాజు గ‌లాసు మార్కెట్లో రూ.50 ప‌లుకుతోందిట‌. ప్ర‌మోష‌న్ కోసం జ‌న‌సేన‌ల హంగామా షురూ చేయ‌డంతో ఈ స‌మ‌స్య త‌లెత్తింద‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ త‌న సినిమాల్లో ఎర్ర కండువా నుదుటికి చుట్టి, గాజు గ్లాసులో టీ తాగుతూ చేసిన హంగామా మొత్తాన్ని ఇప్పుడు పార్టీ ప్ర‌చారానికి వాడేయ‌బోతున్నారు తన అభిమానులు . అలాగే మృగ‌రాజు చిత్రంలో చిరంజీవి గాజు గ్లాసులోనే గ‌రీబోడి ఛాయ్ తాగుతాడు. ఆ పాట‌ను పాడింది కూడా చిరంజీవినే. కాబ‌ట్టి గాజు గ్లాసును జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం చాలా ఈజీ అని జ‌న‌సైనికులు భావిస్తున్నార‌ట‌.పార్టీ కేడ‌ర్ లేదు… వాదించే స్పోక్స్ ప‌ర్స‌న్ లేడు.. పార్టీకి అస‌లు ఓ గుర్తంటూ ఉందా? అంటూ విమ‌ర్శించిన వాళ్ల‌కు ఓ రేంజులో జ‌వాబివ్వాల‌ని చూస్తున్నార‌ట‌.