మోదికి విజ్ఞప్తి చేసిన రాహుల్..!

SMTV Desk 2018-12-26 17:32:53  Meghalaya, Coal mine, Rahul Gandhi, tweet

న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : ఈశాన్య రాష్ట్రాలలో వొకటైన మేఘాలయాలో బొగ్గు గనుల్లో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. గనుల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యల కోసం ప్రభుత్వం హై ప్రెజర్‌ పంప్‌లను సమకూర్చలేదని ఆరోపించారు. మేఘాలయలో అక్రమంగా నిర్వహిస్తున్న గనిలో పోటెత్తిన వరదలో చిక్కుకుని 15 మంది కార్మికులు గల్లంతైన సంగతి తెలిసిందే.

బ్రహ్మపుత్ర నదిపై పొరుగున ఉన్న అసోంలో బోగీబీల్‌ బ్రిడ్జిపై ఫోజులు ఇచ్చే బదులు బొగ్గుగనిలో ఊపిరాడక సతమతమవుతున్న 15 మందిని కాపాడాలని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. పరికరాలు లేకపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్న 15 మంది మైనర్లను రక్షించే ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.