యఫ్ 2 నుండి 'ఎంతో ఫన్'

SMTV Desk 2018-12-26 16:35:50  Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada,Anil Ravipudi, Dil Raju,THAMAN

హైదరాబాద్ , డిసెంబర్ 26 :విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యఫ్ 2 . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు . ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే వొక పాటని విడుదల చేయ్యగా తాజా గా రెండో పాటని కూడా విడుదల చేసారు .


వెంకటేష్,తమన్నా పై తెరకెక్కిన ఈ రొమాంటిక్ సాంగ్ 'స్వర్గమే​ నేలపై వాలినట్టు నింగిలోని తారలే చేతిలోన జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్' అంటూ మొదలవుతుంది . శ్రీమణి రాసిన ఈ పాటలో మొదటి నుండి చివరి వరకు వచ్చే సన్నాయి వాయిద్యం తో వచ్చే ట్యూన్ కొత్తగా ఆకట్టుకునేలాగా ఉంది. కానీ పాట మాములు గా నే సాగుతూ ఇదివరకటి దేవి శ్రీ ప్రసాద్ పాటలని గుర్తు చేసే లాగా ఉంది.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చెయ్యనున్నారు .