అబ్దుల్ కలాం స్మారక మండపాన్ని ప్రారంభించిన మోదీ

SMTV Desk 2017-07-27 14:01:53  thamilanadu, narendra modi, abdhulkalam, rameshvaram

తమిళనాడు, జూలై 27 : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ద్వితీయ వర్ధంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరంలోని కలాం విగ్రహాన్ని ఆవిష్కరించి, రూ. 15 కోట్లతో నిర్మించిన కలాం స్మారక మండపంను ప్రారంభించారు. అనంతరం ఆయన సమాధి వద్ద మోదీ నివాళులర్పించారు. కలాం జీవిత విశేషాలు, సందేశాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సందేశ్ వాహిని బస్సును మోదీ ప్రారంభించి, కలాం కుటుంబ సభ్యులను కలిసి ముచ్చటించారు. కాగా, అయోధ్య నుంచి రామేశ్వరం మధ్య నూతన ఎక్స్ ప్రెస్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఆవిష్కరించారు.