దేశంలో ఐసిస్‌ కలకలం..

SMTV Desk 2018-12-26 16:30:03  ISIS moduleisis, National Investigation Agency (NIA), NIA team, Uttar Pradesh

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత దేశంలో మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ కలకలం రేపుతోంది. ఐఎస్‌ఐఎస్‌కు అనుకూలంగా "హర్కత్‌ ఉల్‌ అరబ్‌ ఏ ఇస్లాం" పేరిట ఓ ఉగ్రవాద సంస్థ పనిచేస్తోందని తాజాగా నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) గుర్తించింది. దీనికి సంబంధించి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌)తో కలిసి సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. అమ్రోహ ప్రాంతంలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

స్థానిక మదర్సా నుంచి వొకరిని అదుపులోకి తీసుకోగా.. మిగతా వారిని అమ్రోహలోని ఇతర ప్రదేశాల్లో ఉండగా అరెస్టు చేశారు. పేరు మార్చుకొని వీరు దేశంలో ఐసిస్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు భావిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు.. దేశంలో విధ్వంసాలకు ఏమైనా కుట్ర పన్నారా? అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.