అవినీతిని ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు: చంద్రబాబు నాయుడు

SMTV Desk 2017-07-27 13:49:33  AP CM, chandrababu naidu, Chief minister, TDP

విశాఖ, జూలై 27 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశాఖ జిల్లాలో సోమవారం పర్యటనలో భాగంగా ప్రగతి మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన 21వేల మందికి ఉచిత ఇళ్ళపట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిని ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు, మీకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఎక్కడ అవినీతి జరిగిన నా దృష్టికి తీసుకువస్తే వెంటనే చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అవినీతిపై చర్యలు చేపట్టడానికి పరిష్కార వేదికను ఏర్పాటు చేశాను ఈ వేదికతో మీరు ఎలాంటి సమస్యలు అయిన నా దృష్టికి సులభంగా తీసుకురావచ్చని దానికోసం 1100 అనే ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేశాం అన్నారు. అవినీతిని తగ్గించడానికి అన్ని సేవలు అంతర్జాలంలో ప్రవేశపెట్టాం, ఏ అధికారి అయిన సరిగా పనిచేయకపోయినా లేక లంచాలు అడిగిన 1100 కి కాల్ చేసి నా దృష్టికి తీసుకురండి అన్నారు. ఇంకా ఆయన ప్రవేశపెట్టిన ఇతర పధకాలు గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో అన్న కేంటీన్ లు , నిరుద్యోగ భృతి పధకాలను కూడా మొదలు పెడుతున్నాం అన్నారు.