సోపోర్ లో పోలీసులపై ఉగ్రవాదుల దాడి

SMTV Desk 2017-05-31 19:07:43  terrorist,polics,jammukashmir

జమ్మూ కాశ్మీర్, మే 31 : జమ్మూ కాశ్మీర్ లోని సోపోర్ లో పోలిసుల పై ఉగ్రవాదులు దాడి కి దిగడం కలకలం సృష్టిస్తుంది. ఉగ్రవాదులు పోలిసుల పైకి గ్రనేట్స్ విసరడం తో అక్కడ ఉన్న నలుగురి పోలీసులకు గాయాలయ్యాయి. వెంటనే అక్కడవున్న భద్రతా సిబ్బంది. స్పందించి. పోలీసులను ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు. వెంటనే ఉగ్రవాదుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.