పూరి డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ !!

SMTV Desk 2018-12-26 12:11:46  RAM POTHINENI,PURI JAGGANATH,RAPO,CHARMI

హైదరాబాద్ , డిసెంబర్ 26 : ఎనర్జిటిక్ స్టార్ రామ్ మొదటి సినిమా తోనే అందరిని ఆకట్టుకుని తనదైన టాలెంట్ తో ఎనర్జిటిక్ స్టార్ గా ఎదిగాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డాన్స్, యాక్టింగ్ బాగా చెయ్యగలిగిన కొద్దీ మంది హీరోల్లో రామ్ వొకడు. ఈ మధ్య రోజుల్లో రామ్ కి సరైన విజయాలు రావడం లేదు. దాని కారణంగా స్క్రిప్ట్ లను ఎంచుకోవడంలో జాగ్రత్త పడుతున్నాడు.

ఆయన తాజా గా "రాపో "సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తుంది, ఆ సినిమా తాలూకా సంకేతాలని తన ట్వీట్ ద్వారా తెలియజేశాడు. " మంచివాళ్ళతో ఆట బోర్ కోటిన్నప్పుడు చెడ్డ వాళ్ళని కలవాలి , నా ఆల్టైమ్ ఫెవరెట్ డైరెక్టర్ పూరి తో వైల్డ్ బోల్డ్ ఫిలిం రాబోతుంది
" అని ఫోటో తో కలిపి ట్వీట్ చేసాడు . ఆ ఫోటో లో రామ్ , పూరి జగన్నాథ్ , ఛార్మి ఉన్నారు .