రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డ రాములమ్మ

SMTV Desk 2018-12-26 11:32:49  Telangana state governament, KCR, TRS Party, Congress party, Vijayashanti

హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలనకు శ్రీకారం చుట్టారు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అరాచకంగా తమ పార్టీ ఎమ్మెల్సీలను తెరాసలోకి విలీనం చేశారని దుయ్యబట్టారు.

అలాగే రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిస్తితి యథా రాజా తథా ప్రజ అన్నట్లుందని ఆమె వాఖ్యానించారు. అంతేకాక శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న వారిని అడ్డుకున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. టీఆర్ఎస్ హయంలో ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని ప్రజలు వనికిపోతున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి అరాచకాలను ఎవరూ సహించరని ఆమె హెచ్చరించారు.