జగన్ కు వార్డు మెంబరుకున్న అనుభవం కూడా లేదు : బాబు

SMTV Desk 2018-12-25 19:32:25  AP, CM, Chandrababu, YSRCP, YS Jaganmohan reddy, Wardmembar

అమరావతి, డిసెంబర్ 25: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వాఖ్యలు చేశారు. జగన్‌కు పంచాయితీలో వార్డు మెంబరుకున్న అనుభవం కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఎకనామిక్స్‌, సోషియాలజీ తెలీదని అన్నారు. అన్నీ ఇచ్చేస్తామని ఆయన కబుర్లు చెబుతూన్నరని, ఇలాంటి అనుభవం లేని వారితో భవిష్యత్‌ దుర్భరంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెక్‌డొనాల్డ్స్‌, కేఎఫ్‌సి కన్నా అన్న క్యాంటీన్లలోనే శుభ్రత, నాణ్యత ఎక్కువని చెప్పారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కొంత రాజధానికి ఖర్చు చేస్తే, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయలేమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే రాజధాని కోసం కావాల్సిన నిధులను కొత్త పద్దతుల్లో సమీకరిస్తున్నామని, ఇలాంటి విధానాల్లోనే ఏపి గెలుపు ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.