టిడిపి ఎమ్మెల్యేల భూ కుంభకోణం : విజయసాయిరెడ్డి

SMTV Desk 2018-12-25 18:33:00  Vijayasaireddy, YSRCP, MP, Kiya factory, TDP,MLA, Parita sunitha, Twitter

అనంతపురం, డిసెంబర్ 25: వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి అనంతపురం జిల్లా పెనుగొండ కియా ఫ్యాక్టరీ వద్ద భూ కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు వ్యక్తం చేశారు. ఈ విషయం పై ఇదివరకే తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ కుంభకోణం వెనుక టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె ఇద్దరు సోదరులు, మరిది సూత్రదారులుగా ఉన్నారని, పేద రైతులను బలవంత పెట్టి ఎకరానికి రూ.30వేల కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

కియా ప్రాంతంలోని భూములన్ని పరిటాల సునీత బినామీ చేతుల్లోకి వెళ్లిపోయాయని అలాగే ధర్మం ఎమ్మెల్యే సూరి కియాతో వందల కోట్లు ఆర్జించారని తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. కియా భూ కుంభకోణంతో కాలువ శ్రీనివాసులతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు కోటీశ్వరుల జాబితాలో చేరారని అంతేకాక అనుబంధ పరిశ్రమల వాల్లు ఎకరానికి రూ.2కోట్ల రూపాయలకు కొనాలా, ఎడారి నుంచి కోట్ల రూపాయలు ఎలా ఆర్జించ వచ్చో టిడిపి నేతలకు తెలుసన్నారు. దోచుకున్న సొత్తుతో అనంతపురంలోని 14 అసెంబ్లీ స్థానాల్లో రూ.500కోట్ల రూపాయలను వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కేచ్‌ అని చెప్పారు.