వరదలో కొట్టుకుపోయిన అంబులెన్స్

SMTV Desk 2017-07-27 12:47:09  RANCHEE, AMBULANCE, JARKHAND, FULL RAINNING , KOYAL RIVER KOPALAMAVU DIST

రాంచి, జూలై 27 : భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసిన వరదలు ముంచుకొస్తున్నాయి. జార్ఖండ్‌లో ఈ వరద బీభత్సంగా ముంచుకు రావడంతో కొపలమావు జిల్లా నుంచి రాంచికి ఐదుగురు వ్యక్తులు వస్తున్న అంబులెన్సు కొట్టుకుపోయింది. ఆ సమయంలో అంబులెన్సులో ఓ పేషెంట్‌తో పాటు ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. కోయల్‌ నది సమీపంలోని సిథోయా వంతెన వద్దకు రాగానే అంబులెన్సు ఆగిపోయింది. దాంతో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి దిగి అంబులెన్సును నెట్టేందుకు యత్నించారు. అప్పటికే వరదల ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అంబులెన్సు కొట్టుకుపోయింది. ఈ కారణంగా రోగితో సహా మిగతావారు కొట్టుకుపోయారు. ఈ విషయాన్ని డ్రైవర్‌ ఎవ్వరికీ చెప్పకుండా పరారయ్యాడు. బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.