వేడి నీటితో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేయండిలా

SMTV Desk 2018-12-25 14:28:38  Health tips, Heat drinking water, Health problems

తీరిక సమయం లేని ఈ తరంలో ఎవరూ వారి శరీరం పట్ల శ్రద్ధ చూపడం లేదు, అందువల్ల అనారోగ్య పాలవుతున్నారు. కనీసం చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు కూడా పాటించడానికి సమయం ఉండడం లేదు. ఇప్పుడు వస్తున్న వ్యాధులను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యంగా ఉండడం చాల అవసరం. కావున రోజు కొంత సమయం శరీరానికి అవగాహనా ఇవ్వడం అవసరం.

రోజు పొద్దునే మరియు పడుకునే ముందు వేడి నీరు తడగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

1. వేడి నీరు తాగడం వల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. అలాగే దానికి సంబంధ స‌మ‌స్య‌లు కూడా తొల‌గిపోతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. పైల్స్ ఉన్న‌వారికి వేడి నీరు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది.
2. అధిక బరువు వున్నవారు ఉదయం, పడుకునే ముందు తాగితే బరువు తగ్గుతారు.
3. వేడి నీరు తరచుగా త్రాగడం వల్ల ఎప్పటికీ మధుమేహం రాదు.
4. శరీరంలో కొవ్వు తగ్గుతుంది.
5. ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి లాంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. శ్వాస ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది.
6. వేడి నీరు తాగడం వల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణ‌లో ఉంటుంది. జ్వ‌రం లాంటి అనారోగ్య సమస్యలు కూడా కుదుటపడతాయి. ఇత‌ర అవ‌య‌వాల‌న్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ప్ర‌ధానంగా కిడ్నీల‌కు చాలా మంచిది.
7. ప‌రరిగ‌డుపున వేడి నీటిని తాగితే శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ఉన్న మ‌లినాలు, చెడు ప‌దార్థాలు, వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి.
8. వేడి నీరు తాగడం వల్ల వివధ రకాల వొత్తిడి సమస్యలు తగ్గుతాయి.
9. నూనె పదార్థాలు, మాంస ఆహారం తినేటప్పుడు వేడి నీరు తాగితే తక్కువ శరీర సమస్యలు ఉంటాయి.

వేడి నీరు తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి కాని వేడి ప్రాంతాల్లో పని చేసే వారు తాగడం మంచిది కాదు. వేడి ప్రాంతాలలో వారు తాగితే తక్కువ దాహం అవుతుంది. వేడి నీరు తాగేటప్పుడు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని తాగాలి.