పుదుచ్చేరిలో ఘోర రోడ్డు ప్రమాదం

SMTV Desk 2017-07-27 12:34:58  bus, accident, 15 membar,

పుదుచ్చేరి, జూలై 27 : పుదుచ్చేరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన పుదుచ్చేరిలోని శయ్యూర్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుంది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సిబ్బంది సహాయంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన 15 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని వారు తెలిపారు.