వాట్సాప్ లో అసభ్యకర సందేశాలు పంపిన యువకుడికి జైలు శిక్ష

SMTV Desk 2018-12-25 13:05:12  Social networks, Whatsaap, Hyderabad city, Harassement, Jail, She team

హైదరాబాద్, డిసెంబర్ 25: ఓ యువతికి వాట్సప్ లో అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ అలాగే తన కోరికలు తీర్చాలంటూ వేదిస్తున్న యువకుడిని నగర షీ బృందం అరెస్ట్ చేసింది. వివరాల ప్రకారం విజయనగరం బొబ్బపేట ఫేజ్‌-3కి చెందిన లగడపాటి దుర్గాసుధేష్‌బాబు హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా గత కొంత కాలంగా ఓ యువతిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

ఆమె వాట్సాప్‌ నంబర్‌కు తరచూ అసభ్య సందేశాలు పంపించడంతో పాటు శారీరక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. వాటిని భరించలేక బాధితురాలు షీ బృందాన్ని ఆశ్రయించింది. దీంతో నిందితుడిని గుర్తించిన షీ బృందాలు అతడిని అరెస్టు చేసి సోమవారం నగర 14వ స్పెషల్‌ ఎంఎం కోర్టులో హాజరుపరిచడంతో కోర్టు అతడికి ఏడు రోజుల జైలు శిక్షతోపాటు రూ.250 జరిమానా విధించారు.