పోలవరం నిర్మాణంలో మరో మైలురాయి

SMTV Desk 2018-12-24 18:08:30  polvaram,cbn,tdp,west godavari,krishna,lift irrigation project, andhra projects,amaravathi, 2019 elections,ysrcp,janasena

అమరావతి,డిసెంబర్ 24 : పోలవరం ప్రాజెక్ట్ అనే ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు. 2014 లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయే సమయంలో ఈ ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసారు. 2014 లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ,పట్టిసీమ నుండి పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ మీదగా కృష్ణ నదిలోకి ఎత్తిపోతల పథకం ద్వారా 100 టిఎంసిల నీటిని పంపి తద్వారా సుమారు 13లక్షల ఎకరాల భూమి సాగుకి దోహదపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని తొలి విజయంగా పేర్కొన్నారు.

అయితే తాజాగా ఈ రోజు మొదటి రేడియల్ గేట్ సెట్ ని ఏర్పాటు చేయబడి ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో మైలురాయిని సాధించింది, దీనిలో మొత్తం 48 రేడియల్ గేట్లు ఉండొచ్చు. పోలవరం ఆంధ్రప్రదేశ్ యొక్క లైఫ్ లైన్ ప్రాజెక్ట్,ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కరువురహిత రాష్ట్రం అవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్నీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.