వెనుకబడిన జిల్లాల్లో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

SMTV Desk 2018-12-24 16:49:50  Telangana state, Poverty districts, Prime minister ujwala yojana scheame, Free Gas connections

హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రధాని మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వార దారిద్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను ఇచ్చే కార్యక్రమాన్ని చమురు సంస్థలు వేగవంతం చేశాయి. వెనుకబడిన జిల్లాల్లో గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను పెంచేలా వారి లక్ష్యంగా చేసుకొని చమురు సంస్థలు రాయితీల బాట పట్టాయి. పట్టణ నగర ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాల్లోని 100 శాతం పూర్తి కాగా కొన్ని జిల్లాల్లోని గ్రామాల్లో 60 నుండి 65 శాతానికి మించి కనెక్షన్లు లేవు.