ప్రతిపక్ష పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెదేపా మంత్రి

SMTV Desk 2018-12-24 16:02:16  AP, TDP, YSRCP, Minister, Atchennayudu, BC Categeory

విజయనగరం, డిసెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ తెదేపా మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్ష పార్టీపై ధ్వజమెత్తారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 32 కులాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. వైఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అణగదొక్కారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల కోసం నాలుగేళ్లలో రూ.16 వేల కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్‌ అంటూ వైఎస్‌ఆర్‌సిపి నాటాకాలాడుతుందని అన్నారు. సంచార జాతులకు బ్యాంక్‌ లింకేజ్‌ లేకుండా సహాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిడిపినే అని అన్నారు.