కొలిక్కి వచ్చిన రిజర్వేషన్ల ప్రక్రియ

SMTV Desk 2017-07-27 12:19:07  telangaana state, reservation bill

హైదరాబాద్, జూలై 27 : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల జనాభా శాతంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. ఇందులో ఎస్సీ జనాభా 54.08 లక్షలు ఉండగా ఎస్టీ జనాభా 31.77 లక్షలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాగా రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ప్రస్తుతం ఎస్సీలకు 1%, ఎస్టీలకు 3% రిజర్వేషన్లు కేటాయిస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. రిజర్వేషన్లు 4శాతానికి పెరగనుండడంతో ఈ రిజర్వేషన్ల కోటా 54 శాతానికి చేరుకోనుంది. ఈ నేపధ్యంలో అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు అతి త్వరలో ఆమోదం లభించనున్నట్లు తెలుస్తుంది.