యు ఆర్ ఇన్సల్టింగ్ మీ : బాలయ్య

SMTV Desk 2018-12-24 14:35:48  Nbk,Ntr biopic,Rana,Ntr biopic, No1 yaari, gauthamiputhra syathakarni,nimmakuru,Tdp,Amarvathi,nandamuri balakrishna

హైదరాబాద్ , డిసెంబర్ 24 : వెండితెరపై బాహుబలి లాంటి చిత్రాల్లో అందరిని ఆశ్చర్యపరిచేల నటించి ఇప్పుడు బుల్లితెరపై 'నెంబర్ 1 యారి' షో తో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు దగ్గుపాటి రాణ. ప్రముఖులతో సరదాగా సాగే ఆ షో ద్వారా వినోదమే కాక వారి మనోగతం కూడా కొంతమేర మనకి తెలుస్తుంది.

తాజా గా ఆ షో కి దర్శకుడు క్రిష్ తో కలిసి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు , దానికి సంబంధించిన ప్రోమో లో బాలయ్య చెడుగుడు ఆడుతున్నాడు , రాణా ని " నువ్వు సార్ అని పిలవడం ఆపవయ్యా, నేనెప్పుడూ చిన్నోడినేగా, యూ ఆర్ ఇన్సల్టింగ్ మీ " ఇలా అంటూ తమదైన ఎనర్జీ తో రెచ్చిపోయాడు . దర్శకుడు క్రిష్ ని "బాలకృష్ణ గారికి కోపం ఉంటదా ? " అని అడుగగా "నేను వేరే చెప్పాలా ? " అని బదులిచ్చాడు . మొత్తానికి ఆ ఎపిసోడ్ లో మంచి ఫన్ ఉంటదనిపిస్తుంది .


క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరో అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత గాద ఆధారంగా తెరకెక్కుతున్న " ఎన్ . టి .ఆర్ బయోపిక్ " జనవరి 9 విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది.