నేడు నగరంలో బీజేపి రాష్ట్ర కోర్‌ కమిటి

SMTV Desk 2018-12-24 14:23:50  Hyderabad city, BJP, Telangana assembly elections, State core comity, Parliment elections, JP Nadda, Muralidhar, Lakshman, Bnadaaru dattatreya, Kishan reddy, MLC

హైదరాబాద్, డిసెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి వోటమికి ఓటమిపై సమీక్షించేందుకు బిజెపి రాష్ట్ర కోర్‌ కమిటి ఈరోజు హైదరాబాద్‌లో సమావేశమైంది. పార్టీ దెబ్బతినటానికి గల కారణాలను విశ్లేషించడంతోపాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై నేతలు చర్చించనున్నారు. సమావేశానికి కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు జేపీ నడ్డా, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు తదితరులు హాజరయ్యారు.