ఆన్‌లైన్ కోర్సుల ప్రవేశానికి సిద్దమైన జేఎన్టీయూ

SMTV Desk 2018-12-24 13:56:14  Telangana, Jawaharlal nehru technological university, Open Online cource, MMO, University grant comisiion, AICTE, Study web of active learning for young aspiring mainds

హైదరాబాద్, డిసెంబర్ 24: నగర కూకట్ పల్లి ప్రాంతంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) తొలిసారిగా మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల(ఎంవోవోసీ)ను ప్రవేశపెడుతున్నది. ఇటీవల అన్ని ఇంజినీరింగ్‌శాఖల హెచ్‌వోడీలు, నిపుణులతో సమావేశమైన వర్సిటీ అధికారులు ఈ కోర్సుల ప్రారంభానికి నిర్ణయం తీసుకొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఏఐసీటీఈ, మానవ వనరులశాఖ నిబంధనల మేరకు స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ (ఎస్‌డబ్ల్యూవైఏఎం) సహకారంతో కోర్సులు నిర్వహించనున్నారు. జనవరి 28 నుంచి ప్రారంభమయ్యే ఈ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్పీటీఈఎల్ నుంచి ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లను సైతం అందించనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు https://online courses.nptl.ac.in ను చూడవచ్చు.