ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వర్మ 'వెన్నుపోటు'

SMTV Desk 2018-12-24 12:13:00  Ramgopal varma, Lakshmis NTR, TDP, Chandrababu, CM, MLA

అమరావతి, డిసెంబర్ 24: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నందమూరి తారక రామారావు గారి జీతితాధారంగా తెరెకేక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఅర్. ఈ చిత్రంలోని మొదటి పాటను ఈ నెల 21 న విడుదల చేశారు.

అయితే అందులో ‘వెన్నుపోటు అనే పాట సిఎం చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చేలా ఉందని అలా వున్న కొన్ని సీన్లు తొలగించాలని టీడీపీ గుంటూరు జిల్లా కార్యదర్శి వీరవల్లి మురళీ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే.. రామ్ గోపాల్ వర్మను ఏపీ రాష్ట్ర ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు.కేవలం పబ్లిసిటీ కోసం ప్రతిపక్షాలకు అమ్ముడుపోయి బాధ్యత గల సీఎంను అవమానించేలా, వ్యంగ్యంగా సినిమాలో సన్నివేశాలను, పాటలను రూపొందిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మురళీ అన్నారు. ప్రతిపక్ష నేతగా పదేళ్లు, రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు రాష్ట్రాభివృద్దికి చంద్రబాబు ఏ విధంగా కృషి చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు.

దివంగత మహా నాయకుడు ఎన్టీఆర్‌ను, ముఖ్యమంత్రి చంద్రబాబును చులకన చేసేలా ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. వర్మకు పిచ్చి పట్టిందని, తక్షణం ఆయనను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి మానసిక వైద్యం చేయించాలన్నారు. యూట్యూబ్‌లో వర్మ విడుదల చేసిన పాటపై తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. వర్మ పైశాచికం చివరిస్థితికి చేరిందన్నారు. తక్షణం ఆయా సన్నివేశాలను తొలగించకుంటే వర్మను రోడ్డు మీద తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు.