పోలవరం గేట్ పనులని ప్రారంభించిన చంద్రబాబు

SMTV Desk 2018-12-24 12:04:29  AP, CM, Chandrababu, Polavaram project, Spill way crust gate

ప.గో.జి, డిసెంబర్ 24: ఈ రోజు ఉదయం పోలవరం ప్రాజెక్టులోని కీలకమైన స్పిల్ వే క్రస్టు గేట్లు బిగించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు గారు ప్రారంభించారు. 40, 41 స్తంభాల మధ్య తొలి క్రస్ట్ గేట్ వద్ద పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేడియల్ గేట్‌ స్థాపన పనులను ప్రారంభించారు. వచ్చే మే నాటికీ గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.

అనంతరం ఎగువన ఉన్న కాఫర్ డ్యామ్ పనులను సీఎం పరిశీలించనున్నారు. నిజానికి డిసెంబర్ 17న ఈ పనులు ప్రారంభించాలని షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ పెథాయ్ తుఫాను కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ముఖ్యమంత్రి తన పర్యటనను వాయిదా వేశారు.