వెబ్ సిరీస్ ను ప్రారంభించనున్న సూపర్ స్టార్...?

SMTV Desk 2018-12-23 17:38:17  Tollywood, Mahesh babu, Namratha, Web series, Short films, Top digital companys

హైదరాబాద్, డిసెంబర్ 23: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో కొన్ని టాప్ డిజిటిల్ కంపెనీలకు వెబ్ సిరీస్ లు అందించేందుకు సిద్దమవుతున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అలాగే కంటెంట్ ప్రధానంగా సాగే చిన్న సినిమాలు నిర్మించి డిజిటిల్ ప్రపంచానికి అందిస్తామని చెప్పినట్టు సమాచారం. దాంతో మహేష్ కు ,నమ్రతకు పరిచయం ఉన్న చాలా మంది దర్శకులు కలిసి తమ ప్రపోజల్స్ పెడుతున్నారట.

రకరకాల జోనర్స్ తో సబ్జెక్టు లు నమ్రతకు వినిపిస్తున్నారట. సినిమా అయితే ఏడాదికి వొకటి మాత్రమే నిర్మిస్తారట. వెబ్ సీరిస్ లు మాత్రం కంటిన్యూగా చేస్తారని సమాచారం. అయితే సినిమాలో కానీ, వెబ్ సీరిస్ లో కానీ తాను నటించడం లేదని చెప్పారు అని చెప్పినట్టు సమాచారం. కేవలం తన పేరు బ్యానర్ క్రింద వస్తుంది అని చెప్తున్నారు. ఇక ఇప్పటికే హుస్సేన్ అని కొత్త దర్శకుడు వెబ్ సీరిస్ మహేష్ బాబు బ్యానర్ లో ప్రారంభించబోతున్నారు. జనవరిలో చివరిలో కానీ పిభ్రవరిలో కానీ ఈ వెబ్ సీరిస్ ప్రారంభం కానుంది.