కృష్ణుడిగా అమీర్ ఖాన్...!!!

SMTV Desk 2018-12-23 17:26:03  Ameerkhan, Sharukh khan, Bollywood, Mahabharatham web series

ముంబై, డిసెంబర్ 23: బాలీవుడ్ అగ్ర కథానాయకులైన అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ కలిసి మహాభారతం అనే వెబ్ సిరీస్ ను స్టార్ట్ చేస్తున్నారు అని ఇన్ని రోజులు ఊహాగానాలే వినిపించాయి. తర్వాత కొన్ని కారణాల వల్ల అమీర్ మళ్ళీ తన ఆలోచనని విరమించుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. దీంతో మహాభారతం ఇప్పట్లో లేనట్లే అనే భావన అందరిలో కలుగింది. ఈ తరుణంలో షారుక్ ఊహించని కామెంట్ తో మళ్ళీ సినీ ప్రేమికుల్లో ఆశలు నింపాడు. ఇటివల ఇచ్చిన ఇంటర్వ్యూలో మహాభారతంలో కృష్ణుడి పాత్ర అమీర్ ఖాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ తనకు అవకాశం ఇస్తే మొదట అదే పాత్రను ఎంచుకుంటాను అని చెప్పాడు. అయితే అమీర్ ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు నాకు చాన్స్ లేదని షారుక్ వివరణ ఇచ్చాడంతో మహాభారతం క్యాన్సిల్ అవ్వలేదని తెలుస్తోంది.