దుర్మార్ఘానికి కూడా హద్డులుంటాయి : బాబు

SMTV Desk 2018-12-23 13:32:51  AP,CM, TDP, Chandrababu, BJP, Narenda modi

అమరావతి, డిసెంబర్ 23: ఈ రోజు నుండి ఆంధ్రరాష్ట్రంకు కేంద్రం ఇచ్చిన హామీలపై శ్వేత పత్రాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బాబు మాట్లాడుతూ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి.. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని ఏపీకి కక్షగట్టినట్టుగా నిధులు ఇవ్వడం లేదన్నారు. అంతేకాకుండా ఏపీని బలిపశువును చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అలాగే ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో అన్ని పార్టీలు మోడీని నిలదీసిన విషయాన్ని ఆయన గుర్తు చేసి దుర్మార్గానికి కూడా హద్దులుంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలను ఆ పార్టీ తుంగలో తొక్కిందని రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు గాను నవ నిర్మాణ దీక్షలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. కాగా 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని హామీని అమలు చేయలేదు అని చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు నిధులుు ఇవ్వడం లేదని
ఇతర రాష్ట్రాల్లో విగ్రహాలకు, హై స్పీడ్ రైళ్లకు లక్షల కోట్లలో నిధులను కేటాయించారనిచివరికి ఏపీకి మాత్రం మొండిచేయి చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సంస్థల విభజనకు సంబంధించి ప్రధాన మంత్రి కనీసం రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి ఏనాడూ మాట్లాడలేదన్నారు.142 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వొక్కటీ కూడ ఏపీకి రాలేదని బాబు చెప్పుకొచ్చారు.