అనుమానంతో ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు

SMTV Desk 2018-12-23 12:12:25  Mahabubnagar, Nawabpet, Kanman kalva, Lovers, Affairs, Bheemamma, Srinivas, Police

మహబూబ్‌నగర్, డిసెంబర్ 23: జిల్లాలోని నవాబ్ పేట మండలం కన్మన్ కాల్వ గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం కన్మన్‌కాల్వ గ్రామానికి చెందిన భీమమ్మ(35) భర్త గతంలోనే వదిలేయడంతో కొన్నిరోజులుగా తంగెడపల్లికి చెందిన ముర్గని శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తనతో కాకుండా మరో ముగ్గురితో కూడ భీమమ్మ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని భావించిన శ్రీనివాస్ ఆమెను చంపాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారంగా ఆమెను పథకం ప్రకారంగా హత్య చేశారు.

ఈ నెల 11వ తేదీన సాయంత్రం నవాబ్‌పేట వద్ద ఉన్ బేకరి వద్ద భీమమ్మను శ్రీనివాస్ కలిశాడు. చీకటి పడిన తర్వాత భీమమ్మకు కల్లు తాగించాడు. నవాబ్‌పేట సమీపంలోని నల్లరాళ్లగుట్ట వద్దకు తీసుకెళ్లి ఆమె గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. మృతురాలిపై ఉన్న బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.పోలీసుల విచారణలో శ్రీనివాస్ వ్యవహరం వెలుగు చూసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. తాను చేసిన తప్పును నిందితుడు వొప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు.