నేడు విశాఖలో కేసీఆర్

SMTV Desk 2018-12-23 11:44:53  TS, CM, KCR, Vishakhapatnam, Begumpet airport, Sharadha peetam, Odissa, Bhuvaneshwar, Home minister, Mohmadd ali

హైదరాబాద్, డిసెంబర్ 23: తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేకర్ రావు ఈ రోజు విశాఖపట్నంకు బయలుదేరారు. కుటుంబసభ్యులతో పాటు బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తున్నారు. మధ్యాహ్నాం 12 గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడ శారదాపీఠాన్ని సందర్శించి...స్వామిజీ ఆశీర్వచనాలు తీసుకుని రాజశ్యామల ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శారదా పీఠంలోనే భోజనం చేసి అనంతరం వొడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు వొడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమవుతారు. రాత్రికి సీఎం అధికార నివాసంలో కేసీఆర్ బస చేస్తారు. విశాఖ బయలుదేరడానికి ముందు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దట్టీ కట్టారు.