సీఎల్పీ పదవిపై స్పందించిన జగ్గారెడ్డి

SMTV Desk 2018-12-23 11:33:52  Jayaprakash reddy, Sangareddy constituency, MLA, Congress party, CLP

సంగారెడ్డి, డిసెంబర్ 23: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్ల్యే తూర్పు జయప్రకకాష్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందిన తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శనివారం మీడియాతో మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ను కాపాడుతూ సంగారెడ్డి ప్రజల సంక్షేమం కోసం తాను పాటుపడుతానని ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడ పార్టీని వీడబోరని ఆయన అభిప్రాయపడ్డారు. తాను సంగారెడ్డి ప్రజలకు తాను ఇచ్చిన హామీలు తనను గెలిపించాయని చెప్పారు. మెదక్ ఎంపీ సీటును తన భార్యకు ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు.

కొందరికి కొన్ని బలహీనతలు ఉన్నాయని, వారి బలహీనతలను తెలుసుకొని వారికి అండగా నిలిస్తే వారంతా పార్టీలోనే ఉంటారని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము విఫలమైనట్టు చెప్పారు. సీఎల్పీ నేతగా తనకు అర్హతలున్నాయని చెప్పారు. ఈ విషయమై తాను కూడ సీఎల్పీ పదవిని కోరుతానని చెప్పారు. పార్టీ సీఎల్పీ నేత పదవిని ఇస్తే పనిచేస్తానని చెప్పారు. వొకవేళ ఆ పదవి ఇవ్వకపోయినా కూడ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. సంగారెడ్డి నుండి తాను మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి తన కూతురు కారణమన్నారు. తన క్యాడర్ కూడ తన గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేసిందని ఆయన గుర్తు చేసుకొన్నారు.