ఈ తరం నటుల పై నాకో డౌట్ ఉంది : బ్రహ్మానందం

SMTV Desk 2018-12-22 19:43:03  Ntr, biopic,svr,Brahmanandam Speech at NTR Biopic Audio Launch

హైదరాబాద్ , డిసెంబర్ 22 :నిన్న జరిగిన యన్.టి.ఆర్ ఆడియో లాంచ్ లో భాగంగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఈ తరం నటుల పై తనకున్న సందేహం వ్యక్తం చేసారు .

వివరాల్లోకెళితే ఆయన మాట్లాడుతూ , అప్పటి పౌరాణిక చిత్రం లో ఎస్ వి .ఆర్ , యన్ . టి .ఆర్ మధ్య జరిగే వొక మహాభారత ఘట్టంలోని సంభాషణల్ని ఆయనే స్వయంగా చెప్పాడు . " ఆ సీన్ రెండు మద గజాల మధ్య జరిగిన యుద్ధం లా అనిపించిందని" అభివర్ణించారు. ఆ తరువాత ఇప్పటి తరం లో అటువంటి నాయకులు అస్సలు ఉన్నారా? అనే సందేహం వస్తుంది అని ఆయన భావాన్ని వ్యక్తం చేశారు .

మీరు ఆలోచించండి ఇప్పుడు వచ్చే నటుల్లో తెలుగు భాషనీ స్వచ్ఛమగా పలకగల అదీ పౌరాణిక పాత్రా చేయగల సత్తా ఎవరికుందో ?