బాలయ్య లో ఇంకో యాంగిల్ ఉంది

SMTV Desk 2018-12-22 19:18:56  Brahmanandam Speech at NTR Biopic Audio Launch, ntr biopic, kathanayakudu , mahanayakudu ,telugu, andhra, telangana

హైదరాబాద్ , డిసెంబర్ 22 : విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా యన్.టి.ఆర్ గారి బయోపిక్ గా వస్తున్న చిత్రం " యన్.టి.ఆర్ " ఈచిత్రాన్ని " కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చెయ్యనున్నారు . ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక నిన్న సాయంత్రం 5 గంటలకి లాంఛనంగా జరిగింది .

అందులో భాగంగా హాస్యబ్రహ్మ బ్రమ్మానందంగారు మాట్లాడుతూ "ఎవరూ పడితే వాడు జీవిత చరిత్ర ను రాసుకోవడం కుదరదు , ఎందుకంటే అక్కడ జీవితం ఉండాలి మరి ముఖ్యంగా ఆ జీవితానికి ఓక చరిత్ర ఉండాలి" అన్నగారికి జీవితమే వొక చరిత్ర అని అన్నారు.
బాలకృష్ణన ను ఉద్దేశిస్తూ "పెద్ద యన్.టి.ఆర్ గొప్పోడు , కారణ జన్ముడు ఆయన కడుపున పుట్టిన బాలయ్యబాబు యాక్షన్ బాగా చేస్తారు , డైలాగ్లు బాగా చెప్తారు... ఈ విషయం నేను చెప్తే .. ఆం .. మాకు తెలీదా అంటారు . కానీ మీకు తెలియాల్సిన , గుర్తించాల్సిన విషయం వొకటుంది అదేంటంటే వొక్క రోజులో నాన్నగారు అది నాన్నగారు ఇది అంటూ సుమారు 10 నుండి 100 సార్లు తల్చుకునే గొప్ప కొడుకు. నటన పట్ల ఆయనకున్న అభిరుచి , కమిటీట్మెంట్ అసామాన్యం . అన్నగారు వేసిన పాత్రలన్నీ వొక్క సినిమాలో చేయడం బాలకృష్ణ అదృష్టం, అయన తో చేయడం నా అదృష్టం " అని అన్నారు .