దగ్గు ఊపిరి ఆడనివ్వట్లేదా..ఇలా చేస్తే నిమిషాల్లో దగ్గు మాయం!

SMTV Desk 2018-12-22 18:22:31   Cough

హైదరాబాద్, డిసెంబర్ 22: చలికాలం వచ్చిందంటే చాలు లెక్కలేనన్ని జబ్బులు వెంటాడతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, తుమ్ములు వేధిస్తుంటాయి. వాటికీ తోడుగా వైరల్ ఫీవర్లు కూడా వస్తాయి. దగ్గు వచ్చిందంటే.. దాన్ని నివారించడం చాలా కష్టం. సిరప్ లు, యాంటిబయోటిక్స్ తీసుకున్నా సరిగ్గా ఫలితం ఉండదు. అయితే, మీ ఇంటిలో దొరికే పసుపుతో దగ్గుకు స్వస్తి చెప్పొచ్చు. పసుపులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల దగ్గును తగ్గిస్తుంది.

* మిమ్మల్ని దగ్గు బాగా వేధిస్తుంటే కొద్దిగా పసుపు కొంచెం తేనే నీళ్ళలో కలిపి తాగండి దగ్గునుంచి ఉపశమనం కలుగుతుంది.
* సొంటి పొడి, తేనే మిశ్రమాన్ని రోజు తీసుకుంటే పొడి దగ్గునుంచి విముక్తి లభిస్తుంది.
* అల్లం టీ రోజుకు 2నుంచి 3 సార్లు తాగితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
* గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని తాగటం వల్ల కూడా దగ్గునుంచి విముక్తి లభిస్తుంది.