ఇంటివాడైన యువ క్రికెటర్

SMTV Desk 2018-12-22 17:20:41  Team india, Sanju samson, Charulatha, Marriege, Delhi dare devils

తిరువనంతపురం, డిసెంబర్ 22: టీమిండియా యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ చారులతతో వివాహం చేసుకున్నాడు. కోవలంలోని ఓ రిసార్ట్‌లో ఇవాళ నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది.





పెళ్లి నిరాడంబరంగా జరగాలన్నది చారులత కోరిక అని సంజు చెప్పాడు. ఆమె ఇష్ట ప్రకారమే అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నామని వివరించాడు.

సంజు, చారులత చిన్నప్పటి నుంచే క్లాస్‌మేట్స్‌. కొన్నళ్ల నుంచే ఇద్దరూ లవ్ లో ఉన్నా.. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించిన విషయాన్ని రెండు నెలల క్రితం సంజు ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తనకు కాబోయే భార్య అంటూ వొక ఫోటోను కూడా షేర్‌ చేశాడు.