రూ.25 లక్షలతో క్రెస్తవ భవన నిర్మాణం : హరీష్ రావు

SMTV Desk 2018-12-22 16:24:57  Harish rao, TRS, Former minister, Siddipeta, Christamus celebrations, Church construction

సిద్దిపేట, డిసెంబర్ 22: తెరాస మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు మీ ఆశీస్సులతోనే దేశంలోనే అత్యధిక మెజార్టీతో నేను గెలిచానని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. సిద్దిపేటలో రూ. 25 లక్షలతో క్రైస్తవ భవన నిర్మాణం చేపడుతామన్నారు. పేద క్రిస్టియన్లకు డబుల్ బెడ్ రూం ఇండ్లలో అవకాశం కల్పిస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.