సైన్స్ పురోగతిలో మన శాస్త్రవేత్తల కృషి చాలా వుంది : హర్షవర్ధన్‌

SMTV Desk 2018-12-22 16:16:55  Central minister, Harshavardhan, Kookatpally

హైదరాబాద్, డిసెంబర్ 22: ఈరోజు కూకట్‌పల్లిలో జాతీయ మహసముద్ర సమాచారం కేంద్రంలో అంతర్జాతీయ మహాసముద్ర కార్యాచరణ విజ్ఞాన శిక్షణ కేంద్రాన్ని కేంద్రామంత్రి హర్షవర్ధన్‌ ప్రారంభించారు. తర్వాత అటల్‌ అతిథి గృహసముదాయాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతు శాస్త్ర సాంకేతికతలో ప్రపంచంలోనే మనం మూడో స్థానంలో ఉన్నామని తెలిపారు. సునామీ హెచ్చరికలను గుర్తించడంలో భారత్ ముందుంది. తప్పుడు సమాచారం ఇవ్వకుండా కచ్చితమైన సమాచారం ఇస్తున్నామని స్పష్టం చేశారు. సైన్స్ పురోగతిలో మన శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందన్నారు.