అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

SMTV Desk 2018-12-22 16:09:00  Telangana ruling party, TRS, Congress party. MLA, Gandra venkataramana reddy, MLC

వరంగల్‌, డిసెంబర్ 22: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెరాస పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర అధికార పార్టీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని ఎమ్మెల్సీల విషయంలో టిఆర్‌ఎస్‌ ఆకర్ష్‌ రానురాను వికర్ష్‌గా మారే అవకాశం ఉందన్నారు.

ఎమ్మెల్యేలను ఆకర్షించే పనులు పక్కనపెట్టి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. సీఎల్పీ లీడర్‌గా తానూ అర్హుడినే అని గండ్ర తెలిపారు. సిఎల్పీ లీడర్‌గా పార్టీ అవకాశమిస్తే సమర్ధవంతంగా పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారుతారని అనుకోవడంలేదని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.