అధికారిక లాంఛనాలతో దాసరికి చివరిగా వీడ్కోలు

SMTV Desk 2017-05-31 18:17:56  dhasari narayanarao, mohinabad fham house, telangana government respected, mohanbabu and family

హైదరాబాద్, మే 31 : దర్శకరత్న దాసరి నారాణరావు అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ మండలం తోల్ కట్టలో దాసరి ఫామ్ హౌస్ లోనే ... ఆయన సతీమణి పద్మ సమాధి పక్కనే అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మధ్య అంతిమ సంస్కారాలు పూర్తి చేసి అంత్యక్రియలు నిర్వహించారు. దాసరి పెద్ద కుమారుడైన ప్రభు తండ్రి చితికి నిప్పుపెట్టారు. ఈ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా వీడ్కోలు పలికారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంభ సభ్యులు దగ్గరుండి మరి అంత్యక్రియలను నిర్వహించారు.