ఆర్జీవి పై కేసు పెట్టిన కర్నూలు ఎమ్మెల్యే

SMTV Desk 2018-12-22 15:23:16  Ramgopal varma, Kurnool MLA, SV Mohanreddy, Lakshmees NTR, Vennupotu song

కర్నూలు, డిసెంబర్ 22: టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నందమూరి తారక రామారావు గారి జీతితాధారంగా తెరెకేక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఅర్ . ఈ చిత్రంలోని మొదటి పాటను శుక్రవారం విడుదల చేశారు.

అయితే అందులో ‘వెన్నుపోటు అనే పాట సిఎం చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చేలా ఉందని కర్నూలు ఎమ్మెల్యె ఎస్వీ మోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈకుట్రలో వెనక ఉండి రాంగోపాల్‌ వర్మను నడిపిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యె కోరారు.