ఏపీ నిరోద్యులకు తీపి కబురు

SMTV Desk 2018-12-22 12:10:58  Andhrapradesh, Unemployers, Jobs notifications, APPSC, Uday bhaskar, Groups notifications

అమరావతి, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ గ్రూప్‌3 (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌4) ఉద్యోగాల ప్రకటన వెలువడింది. ఆర్థికశాఖ అనుమతించిన 1000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులతోపాటు అదనంగా 51 (గతంలో భర్తీకాకుండా ఉన్న పోస్టులు) భర్తీ చేసేందుకు శుక్రవారం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతోపాటు మహిళా శిశు సంక్షేమశాఖకు చెందిన ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌1 ఉద్యోగ నియామకాల ప్రకటనా విడుదలైంది. కమిషన్‌ ఛైర్మన్‌ ఉదయ భాస్కర్‌ వివరాలను వెల్లడించారు

• గ్రూప్‌3 మొత్తం పోస్టులు: 1051
• దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఈనెల 27
• దరఖాస్తుకు తుది గడువు: జనవరి 19
•ప్రాథమిక పరీక్ష జరిగే తేదీ: ఏప్రిల్‌ 21
• ఆన్‌లైన్‌లో ప్రధాన పరీక్ష తేదీ: ఆగస్టు 2

జిల్లాల వారీగా గ్రూప్‌3 పోస్టులు
• శ్రీకాకుళం: 114
• విజయనగరం: 120
• విశాఖపట్నం: 107
• తూర్పుగోదావరి: 104
• పశ్చిమగోదావరి: 25
• కృష్ణా: 22
• గుంటూరు: 50
• ప్రకాశం: 172
• నెల్లూరు: 63
• చిత్తూరు: 141
• అనంతపురం: 41
• కర్నూలు: 90
• కడప: 2 (క్యారీ ఫార్వర్డ్‌)